Monday, January 28, 2008

ఆకాశానికి నిచ్చెనలు

ఇంత వరకు ఎవరైనా ఆకాశానికి నిచ్చెనలు వేసి, ఆకాశాన్ని అందుకున్నారా? ఇంకొంచెం దీక్షగా, మరి కొంత మనస్సు, దృష్టి కేంద్రీకరించి చూడండి. అవిగో, అనంతమైన ఆకాశంలో లక్షలాది, కోట్లాది నిచ్చెనలు ఆకాశం అంచులను తాకుతూ కనబడటం లేదా మీకు? అన్న ఎ.జి.కృష్ణమూర్తి గారి ప్రశ్నకు అందరికీ అనంతమైన ఆకాశాన్ని అందుకోవాలనే కల కలుగుతుంది. నెరవేరని కలలుండవు అన్న మాటను మనం నమ్మితే ఎవరో మహానుభావుడు చెప్పినట్టు ప్రపంచంలో అన్ని శక్తులు మనల్ని మన గమ్యం చేరుస్తాయంటూ కృష్ణమూర్తిగారు తన జీవితానుభవాలను, తన కల సాకారమైన విధానాలను, అలా సాకారమయ్యేందుకు అతనికి సహాయ సహకారాలందించిన అందరి భావాలను మనకందిస్తూ, జీవితంలో ఆయన నేర్చుకున్న పాఠాలు (అలా అని ఇది ఆయన స్వీయ చరిత్ర కాదు) అందరిలో స్ఫూర్తిని నింపేందుకు, అందరూ విజేతలు కావాలనే ఆకాంక్షతో అందించిన చిన్న పుస్తకమే "ఆకాశానికి నిచ్చెనలు" , దీనికి ఆంగ్ల మాతృక ఆయన "దేశీ డ్రీం మర్చెంట్స్" (Desi Dream Merchants), అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో..


ముద్ర కమ్మునికేషన్స్ ఫౌండర్ ఛైర్మన్ ఎ.జి.కృష్ణ మూర్తి గారు అతి తక్కువ పెట్టుబడితో, ఒకే ఒక్క క్లైంట్తో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళలలో ముద్ర భారతదేశంలో అతి పెద్ద అడ్వర్టైజింగ్ ఏజన్సీ లలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. ఈ పుస్తకంలో ముద్ర గురించి కూడా మనం తెలుసుకుంటాం. కలలు కంటే సరిపోదు. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించాలి, ఏ విధంగా పయనించాలి, ఏదైనా ఒక పనిని సాధించడానికి ఎలా కృషి చేయాలి మొదలైన విషయాలను ముద్ర టీం వాళ్ళు అంటే అంతటి గొప్ప సంస్థలో ఉద్యోగం చేసిన వారు, తద్వారా వారి కలలను సాకారం చేసుకున్న వాళ్ళు చాలా చక్కగా వివరించారు. ముద్ర గొప్పతనం చెప్తూనే, అందుకు వాళ్ళు పడ్డ శ్రమను కూడా తెలియజేసారు. యాడ్ ఏజెన్సి అంటే మృదువుగా, నాజూకుగా మాట్లాడటం, స్టైల్గా అటూ, ఇటూ తిరగడం, వేరే వాళ్ళు కష్టపడి దంచుతుంటే ఇంకెవరో భుజాలెగరేయడమన్నది కేవలం అపోహేనని, ఏసీ రూముల్లో, ఈజీ చైర్లో కూర్చుని చేసే పని కాదని, అసలు యాడ్ ఏజెన్సీ అంటే ఏంటో తెలియజెప్పిందీ పుస్తకం. అలాగే జీవితంలో విజయాలను సొంతం చేసుకునేందుకు కావల్సినంత ఉత్సాహం, ఊరడింపునిస్తుంది.


ముందుగా ఏ పనైనా చేయాలంటే వ్యక్తులు సరైన వాళ్ళై ఉండాలి, సవాళ్ళని ఎదుర్కోవాలి, ప్రతీ నిమిషం కొత్తగా శ్వాసించాలనే ఉత్సాహం వారికుండాలి. ఇలాంటి వ్యక్తులే ముద్రలో పని చేసారు, ముద్రకు అంకితమయ్యారు, ముద్ర మనుషులయ్యారు. "తిక్కల్లేని ప్రతిభ, పొగరులేని ప్రావీణ్యం" అన్న ముద్ర ఫిలాసఫి మనమూ ఫాలో అయితే మనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవచ్చు కదా. అవసరం కొత్త దారిని చూపిస్తుంది. సంస్థ లేదా పని అవసరాన్ని బట్టి, ఏ పని చేసినా గట్టి నమ్మకంతో ముందుకెళ్తే, అవసరం వచ్చిన వెంటనే ఓ ప్లాన్‌తో సిద్ధంగా ఉంటూ, ఆలస్యం చేయకుండా ఆచరణలో పెడుతుంటే మొదట కొన్ని ఒడిదుడుకులెదురైనా పని మాత్రం తప్పక పూర్తవుతుందని, ఎంతో హాయిని కలిగిస్తుందని 'ముద్ర పధ్ధతి" ద్వారా మళ్ళీ ౠజువైంది. అవసరం మంచి ఆలోచనలను కూడా రేకెత్తిస్తుంది. అందుకే ఆ దిశగా అందరూ ఆలోచించినట్లైతే ఇంకా ఎన్నో విజయాలు సాధించవచ్చు. కొత్త పుంతలు తొక్కడానికి నగర నేపథ్యం అవసరం లేదు, మేథావులుగా చలామణీ కానక్కర్లేదు, టక్కు టమారా విద్యలు ప్రదర్శించి, ప్రసంశలు పొందక్కర్లేదు. సూటిగా చెప్పాలంటే- విభిన్న్నంగా ఆలోచించడం మొదలుపెడితే, నీ గమ్యాన్ని నీవే నిర్దేశించుకుంటావు, నీకెవరూ కొమ్ములు తిరిగిన మేథావులు చెప్పనవసరం లేదని ముద్ర నమ్మకం, నాకూ నమ్మకమే. సాధారణంగా అందరూ నిజాలు వినడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు చిన్నబుచ్చుకునే విషయాల్ని చెప్పినప్పుడు మాత్రం అసహ్యించుకుంటారు. సంస్కృతంలో ఓ నానుడిలా, నిజం చెప్పాలి, ఇష్టమైన మాట చెప్పాలి, ఇష్టం లేనిది నిజమైనా చెప్పకూడదు. అలాగే అబద్ధం, ఇష్టమైనదైనా చెప్పకూడదు. అందుకే ఆ సంస్థలో ఉద్యోగులు నిజమే చెబుతూ, నిజాయితీగా ఉంటూ, ఎంతో కృషి చేస్తూ, ప్రతిభా పాఠవాలను ప్రదర్శించిన ఫలితంగా రెండు బ్రాండ్లు సాధించిన విజయాల్ని యావత్ అడ్వర్టైజింగ్ పరిశ్రమ గుర్తించింది. మనకూ తెలుసు అవేంటో, మొదటిది విమల్, రెండో బ్రాండ్ రస్న - దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. కసి, పట్టుదల, సాధించాలనే తపన, కృత నిశ్చయాలతో ముందుకు వెళితే విజయం ఎవరికైనా తథ్యమని తెలుసుకోవచ్చు. కానీ, పెరుగుతున్న కొద్దీ విజయానికి కారణమైన అంశాల్ని మర్చిపోకూడదు.



ఇక చాలా మంది హోదా, జీతం, ఆఫీసు సౌకర్యాలు ... మొదలైన వాటితో తృప్తిపడిపోతారు. బలిసిన పిల్లి ఎలాగైతే కదలడానికి తెగ కష్టపడిపోతుందో, వీళ్ళు కూడా అంతే. ఉన్న దాంతో తృప్తి పడిపోతారు. మనలోగానీ, మన సంస్థలో లేదా పనిలో గానీ ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోయిందో మనకు గడ్డు రోజులు వచ్చినట్టే, క్షీణ దశ ఆరంవ్భమైనట్టే!! భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, మనం ఎలా కావాలనుకుంటే, దాన్ని అలా రూపొందించుకోవచ్చు. మనం వేగంగా, పెద్దగా అభివృద్ధి చెందాలి. ఏ రంగంలోనైనా, నిలదొక్కుకోవాలంటే పైకి సులువుగా ఎగరగలం. భారం ఎక్కువైన కొద్దీ, మరో కక్ష్యలోకి వెళ్ళాలంటే అధిక శక్తి అవసరం. ఫోర్లు, సిక్స్లు కొడితేనే మరో ఓవర్ ఆడే అవకాశం కలుగుతుందన్న ఎజికెగారి మాటలు ఆ ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ వృత్తి నిపుణులైన డాక్టర్ నాగానంద్కే కాదు, అందరికీ కర్తవ్య బోధ చేస్తాయి. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలనుకోవాలి. ఆ లక్ష్యం చంద్రుడనుకుంటే, మనం చంద్రుణ్ని చేరుకోవచ్చు లేదా చేరలేకపోవచ్చు, కనీసం చెట్టు చివరిదాకా వెళ్ళినా మంచిదే. అందుకే ముందుగా పనిని ప్రారంభించాలి. ఓ చోట స్థిరంగా ఉన్న లక్ష్యాన్ని ఎవరైనా చేధించగలరు. కదులుతున్న మత్స్య యంత్రంలాంటి లక్ష్యాన్ని కొట్టాలంటే, అది అర్జునుల వల్లే సాధ్యం! మనం అర్జునులం కావాలి. మనం చేసే ప్రయత్నంల విఫలం కాకూడదనుకుంటూ ముందుకు సాగాలి.


ముద్ర సంస్థకు ప్రత్యేక ఆభరణాలైన ఆ పద్ధతి, పనితీరు, ఆ తపన మొత్తంగా ముద్ర ఫిలాసఫీ విలక్ష్ణమైంది. అది అందరినీ కలిసికట్టుగా, ఓ జట్టుగా ఉంచుతుంది. అలాగే 'ఇది మనదీ అనుకునేట్టు చేస్తుంది. ఈ ఫిలాసఫి పుస్తకాల్లో ఉండదు. ఎగిరి అందుకుందామంటే ఎక్కడా కనబడదు. కన్న కలను సాకారం చేసుకోవాలంటే అందుకు తగ్గట్టుగా కష్ట పడాలి. అందరికంటే "కొంచెం ఎక్కువ"గా. ఆ "కొంచెం ఎక్కువ" పని చేసి, ఎంతో మంది హీరోలయ్యారు., ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. "ఎవరూ గొప్పవాళ్లుగా పుట్టరు", అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూండాలి. అలాగే అద్భుతాల్ని ఎవరైనా సాధించొచ్చు, అందరూ సాధించొచ్చు. కేవలం నాలుగు లక్షణాలు - ప్రతిభా పాఠవాలు, సాధించాలనే కోరిక, పని మీద వ్యామోహం, నిజాయితీ లు. ఇందులో ఏ ఒక్క లక్షణం లేకపోయినా విజయం సాధించడం కష్టమని వేరే తెలుసుకోనవసరం లేదు. అలా ఎదిగే దశలో కిందపడినా మామూలు వారైతే నవ్వుతారు, పట్టించుకోకుండా వెళ్ళి పోతారు కానీ ముద్ర మనుషులు మాత్రం అలా నవ్వరు, లోపల్లోపల కూడా ఎవరూ సంతోషించరు. అయ్యో! ఇలా జరిగిందా అని సానుభూతితో ఓ మాటనేసి ఎవరూ వెళ్ళిపోరు, కిందపడితే లేపి, ముందుకు నడిపించడానికి వంద చేతులు సిద్ధంగా ఉంటాయి. భారతీయ కుటుంబ వాతావరణంలో ఎవరైనా విఫలమైనపుడు అవమానించడం ఉండదు. అలాగే వారి ఆశయాన్ని అనుమానించడముండదు. అన్నిటికీ మించి, అందర్ని ముందుకు నడిపించడానికి, అవసరమైనపుడు సహాయమందించడానికి కుటుంబ పెద్ద ఉండనే ఉంటారు. అయితే ఈ మధ్య కొంత మంది భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకోలేకపోవడం వళ్ళ అలా నవ్వుతున్నారు, పట్టించుకోకుండా ఉంటున్నారు కానీ నిజానికి భారతీయ సంస్కృతిలో అవమానించడమనేది ఉండదు. అందుకే భారతీయ సంస్కృతికి అంత గొప్ప పేరు. ప్రతిభా ప్రావీణ్యాలను గుర్తించడానికి పై పై మెరుగుల హడావిడి అవసరం లేదని, మనదైన పద్ధతిలో ముందుకు వెళ్ళొచ్చని, తాను నమ్మిన ఆశయాలతో ప్రచారం చేయొచ్చని, ప్రభావం కలిగించ్చొచ్చని, ఆలోచన మంచిదైనప్పుడు, అది వస్తువైనా, ప్రదేశమైనా, మనిషైనా, విజయం తప్పక లభిస్తుందని ముద్ర ద్వారా, ఈ పుస్తకం ద్వారా తెలియవస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పని సాఫీగా జరిగిపోవాలి. పని జరిగి తీరాలి, ఎలాగైనా సరే, ఎప్పుడైనా సరీ, అదే కదా వర్క్ కల్చర్.



ఇక ఈ పుస్తకం రెండవ భాగం ఎజికె గారు నేర్చుకున్న పాఠాలు. ఆయన వాటిని తన వ్యాసాలుగా బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో "ఎజికె స్పీక్" కాలంలో కూడా ప్రచురింపజేసరు. సెప్టెంబర్ 3,2004 నుండి ఆగష్టు 19, 2005 వరకు 15 రోజులకొకసారి ప్రచురితమైన, పేరొందిన వ్యాసాలు. మొదటిగా ఆయన నేర్చుకున్నది,మనకు తెలియజేసింది పని,పని,పని. ఈ రోజుల్లో చాలా మంది యజమానులు, తమ ఉద్యోగులు రోజంతా కష్టపడిపోవాలనే కోరుకుంటారు. అలా లేనప్పుడు తెగ బాధ పడిపోతుంటారు, అంతేకాక, వళ్ళ కోసం కొత్త కొత్తగా ఏవో సృష్టిస్తుంటారు. అయితే చేయాల్సిందది కాదని, ఇలాంటి విషయాలను కొంచెం తేలిగ్గా తీసుకుంటూ, వారిని కొంచెం విశ్రాంతి తీసుకోనిస్తూ, కోపం తెచ్చుకోకుండా ఉంటే, వాళ్ళు రిలాక్సయ్యాక, తిరిగి ఎంత ఉత్సాహంగా పనిని ప్రారంభిస్తారో చూస్తే ఎటువంటి సంస్యలుండవంటూ ఉదహరణలతో చెప్పారు.



గురుశిష్య పరంపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!

మనుషులు గుంపులుగా, సమూహాలుగా ఉన్నప్పుడు వాళ్లల్లో బాధ్యతాయుతమైన ప్రవృత్తి పలచబడిపోతుందట! ఎవరో ఒకరు చూస్తారులే, ఏదో చేస్తారులే అనే భావం పెరిగిపోయి, అందరూ అలా అనుకుంటూ, ఎవరూ ఏమీ చేయరు. ఫలితం శూన్యం. నిజానికి ఇదో పెద్ద సమస్య కాదు. స్పష్టమైన నాయకత్వం లేకపోతే ఏదైనా సరే బాధ్యతను తన దగ్గర్నుంచి వేరే వ్యక్తి నెత్తి మీదకు నెట్టేద్దామనే అనుకుంటారు. కనుక, నాయకుడు పటిష్టంగా ఉండాలంటారు. మంచి నాయకుడ్ని ఎంపిక చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.అందుకు ముఖ్యంగా ఉండాల్సింది నూటికి నూరు శాతం నమ్మకం. చూడనిదాన్ని నమ్మటం విశ్వాసం. ఆ విశ్వాసానికి ప్రతిఫలం నమ్మినదాన్ని చూడటం. ఏదైనా సాధించవచ్చని కొందరు ఆత్మవిశ్వాసంతో, అపార నమ్మకంతో చెప్పే మాటలు ఒక్కోసారి అర్థం లేనివిగా అనిపించినా, నమ్మకమనేది నూరు శాతం ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది. ఇది కేవలం ఒక్క వ్యాపారానికో, పనికో వర్తించింది కాదు, నిత్య జీవన విధాన వ్యవహారాలకూ వర్తిస్తుంది. పూర్తి విశ్వాసంతో చేసిన కొన్ని ప్రయోగాలు సంచలనాలు సృష్టించాయి కదా. క్లుప్తంగా ఎజికె గారి మాటల్లో చెప్పాలంటే, మనం నమ్మేదాన్ని బట్టే వాస్తవం ఉంటుంది. అదీ ఎప్పుడంటే నూటికి నూరు శాతం మన నమ్మకం ఉన్నప్పుడు. జీవితంలో ప్రతీ పనికీ ఓ సమయం ఉంటుంది. అదెప్పుడు వస్తుందో, ఎవరికి వారికే తెలుస్తుంది. దేనివల్ల మనకు హాని కలుగ్గుతుంది, దేనివల్ల మనకు లాభం చేకూరుతుంది, ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో దీర్ఘకాళిక ప్రయోజనాలు పొందవచ్చు. నాలుగు రోడ్ల జంక్షన్లో ఉన్నప్పుడు ఏ రోడ్డులో వెళ్తే మంచిదన్న సంగతి ఎలా తెలుస్తుంది? అదే నేర్చుకోవాలి. ఉద్యోగం ఎంపిక చేసుకునేటప్పుడు, ఏ రంగం మనకు సరైనదో నిర్ణయించి, ఆ తరువాత సంస్థను ఎంచుకోవాలి. సంస్థలు కూడా వ్యక్తుల వంటివే. అందుకే మన మనస్తత్వానికి, పనితీరుకు సరిపోయే సంస్థను ఎన్నుకోవాలి. తర్వాత బాస్ సంగతి... బాస్గా ఉన్న వ్యక్తే, కొంతకాలం మనకు ఫ్రెండ్గా, గైడ్గా ఉండాల్సి వస్తుంది. మన భావాలకు వ్యతిరేకంగా ఉండే నాయకుడిని ఎంపిక చేసుకోవద్దంటారు. అయితే ఇవన్నీ ఒకే రోజులో అయిపోయేవి కావు. చాలా సమయం పడుతుంది. సులభంగా కూడా అయ్యేవి కావు. కష్టపడి సాధించాలి. అందుకే ముందుగా మనకేం కావాలో, ఎప్పుడు కావాలో తెలుసుకుంటే, మన మార్గంలో వచ్చే ఆటంకాల్ని ఎదుర్కోగలం, ఇవన్నీ జరిగితే కలల్ని నిజం చేసుకుని ఆనందించగలం. నిజమే కదా మరి. ఎప్పుడూ విజయాలే రావు. ఓటమిని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఓడిపోవడం కూడా ఒక కళే. జీవితంలో ఎప్పుడూ ఒకరికే విజయాలు రావు, రాకూడదు కూడా అని అంటుంటారు. ఒక్కొకరికీ ఒక్కో సమ్యంలో, సందర్భంలో విజయం దక్కితేనే అందరి జీవితాలకు సార్థకత చేకూరుతుందట. అయితే ఎంత హుందాగా గెలుస్తామో, ఓడిపోయినప్పుడూ అంతే గౌరవంగా, హుందాగా ఉండాలంటారాయన. అది ఎక్కడైనా, రాజకీయాలు, వ్యాపార లేదా ఇతర సొంత విషయాలు కావచ్చు.

చాలా సమయాల్లో మనల్ని ఎవరైనా కాదన్నా, వాళ్ల ద్వారా మనసు గాయపడినా ఒక్కసారిగా మన ఆలోచనా విధానం మారిపోతుంది. దాంతో అర్థం లేని ఆరోపణలు, విమర్శలు చేసేస్తాం. అలా కాక సమ్యమనంతో వ్యవహరించి, పరిస్థితిని చక్కదిద్దితే అన్ని సంస్యలూ పరిష్కారమౌతాయి. మనల్ని పరిశీలించేవాళ్లు మనం ఓడిపోయినప్పుడైనా, గెలిచినప్పుడైనా ఒకేలా చూస్తారు, మనం సమ్యమనంతో ఉంటే. అలా కాక, ఓడిపోయామని ఎదుటివాళ్లని ధూషిస్తే సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోతాయి. తిరిగి ఏర్పరచుకోవడం చాలా కష్టం. తప్పులు సరిదిద్దుకుంటే మరో మెట్టు పైకెళ్ళవచ్చని ముద్రలో జరిగిన తన అనుభవాలను చెప్పారు కృష్ణమూర్తి గారు. ఇలా మనం సాగిస్తున్న జీవితంలో మనం నమ్మిన వారు నమ్మక ద్రోహులు కావచ్చు . మనల్ని మోసం చేయొచ్చు. అలా అని వారిని ముందుగా కనిపెట్టలేం, ఇలాంటి కుట్రలు, కుతంత్రాల మధ్యే మనం మనుగడ సాగించాలి. అలాగని "ఎవరినీ నమ్మకూడదు" అని అనుకోలేం. వీరిలో నమ్మకస్తులుంటారు. నిజానికి నమ్మకం, అనుబంధం లేకపోతే మనం జీవితంలో ముందుకెళ్ళలేం. నమ్మకాన్ని వమ్ము చేసేవాళ్ళు ఎంతమంది తారసపడినా, నమ్మకస్తుల సంఖ్యను పెంచుకుంటూపోవడమే తెలివైన పనంటారు ఎజికె, తాను నమ్మిన వాళ్ళు మోసం చేసిన అనుభవాలతో. మన విజయానికి ముఖ్య సూత్రం "పనే పరమావధి". ధైర్యం చేసి ఏ పనైనా చేయాలి. మనకెందుకులే అని కాకుండా, అది మన పని కాకపోయినా, చేయవల్సిన అవకాశం, సందర్భం వస్తే తప్పకుండా చేయాలి. ముందు తరాల వారిని సరైన దిశలో నడిపించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏ బాటలో నడిస్తే - భవిష్యత్ తరాల వారు కూడా అదే మార్గంలో పయనిస్తారు, దీని కోసం ప్రత్యేకించి కష్టపడనక్కర్లేదు, ముందు పని చేయాలి, జస్ట్ డు ఇట్ అన్న మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం.
ఎజికె గారు సాధించిన విజయాల వెనుక మూడు సూత్రాలున్నాయట. మొదటిది వ్యక్తిత్వానికి అడ్రస్ మనం వేసుకునే డ్రస్. సింపుల్గా ఉండాలిగానీ ద్రస్సింగ్ పట్ల అశ్రద్ధ కనబరచాలి. ఎందుకంటే మనల్ని మనం పూర్తిగా పరిచయం చేసుకునేంత వరకూ మన వ్యక్తిత్వాన్ని తెలిపేది మన డ్రస్సేగా. రెండవది సమయపాలన. ముందుగానైనా ఉండొచ్చుగానీ, ఆలస్యం కాకూడదు. అలా ఆలస్యమైతే కలిగే భావన ఎంతో వేదనకు గురి చేసి, గిల్టీ ఫీలింగ్ కలిగించి, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇక మూడవది మనం రోజూ కార్యకలాపాలు ఒక లిస్ట్ రాసుకుంటే, ఓ రోజు పూర్తయ్యాక, లిస్ట్ చూసుకుంటే, మన జీవితంలో ఒక అమూల్యమైన రోజు ఎలా గడిపామో మనకు తెలుస్తుందంటూ, అలా చేయడం వల్ల ఆయనకు ఎన్నో విజయాలు వచ్చాయంటారు. అంతేకాక, వీటిని పాటించడంలో విఫలమైన వారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కున్న సందర్భాలున్నాయట. ఇక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, ఇగోను పక్కన పెట్టాలి. లేకపోతే తన కోపమే తన శత్రువని మనకందరికీ తెలుసు కదా. ప్రత్యర్థుల్ని గౌరవిస్తూ, అవరోధాల్ని ఎదుర్కొని విజయం దక్కించుకోవాలి. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కెరటం కావాలి మనకు ఆదర్శం, పడినందుకు కాదు, పడినా లేచినందుకు. జీవితం నేర్పిన పాఠాల్ని గుర్తు పెట్టుకుని, అడుగు ముందుకేస్తే, రేపు మనదే, గెలుపు మనదే అన్న ఆయన మాటలను నిజంగా ఒప్పుకోక తప్పదు. ఇక్కడ ఇంకో విషయముంది. మనం ప్రతీదీ శాశ్వతమని అనుకోవడం వల్ల దానిని సకాలంలో చేయం. అశాశ్వతం అనుకున్న రోజున జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ అన్ని పనుల్ని సత్వరం నెరవేర్చాలని అనుకుంటున్నాం. జీవితంలో మనకెదురయ్యేవన్నీ ఒక రకమైన బహుమతులు. వాటిని స్వీకరించాలి, అనుభవించాలి, సంతోషించాలి. మనకు ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలీదు. అందుకే వచ్చిన ఛాన్స్ని సద్వినియోగం చేసుకోకపోతే, అంతకు మించి పెద్ద తప్పు వేరేదీ ఉండదు. నిజమే కదా.

కోరికలు గుర్రాలంటారు, అవి ఒక్కోసారి దెయ్యాలుగా కూడా మారుతుంటాయి. ఎవరైనా కోరికలకు అతీతులు కారు. కోరిక ఓ స్థాయిలో నెరవేరగానే సరిపోదు. ఇంకా పై స్థాయిలో అవి నెరవేరాలని మనం కోరుకుంటాం. సంతృప్తి అనేది లేకపోతే కోరికలు నెరవేరలేదనే ఆవేదన, ఆక్రోశం పెరిగిపోతాయి. కనుక, కోరికల్ని అభివృద్ధి చేసుకోవద్దంటారు, వాటిని అంతం చేయాలంటారు.

సమిష్టి కృషిని గౌరవించే ఈ పుస్తక రచయిత, తన బృందంలో సభ్యుల అభిప్రాయాలకూ ఈ పుస్తకంలో పెద్ద పీట వేశారు. అందరి అంతరంగ భావాల అద్భుత విశ్లేషణలకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. జీవిత గమ్యం తెలుసుకుని కలలు కన్న ప్రతీ ఒక్కరం ఆకాశానికి నిచ్చెనలు వేసి, విజేతలమై ఇతరులకూ మార్గదర్శకులం కావచ్చు. అలా కావాలని ఆశిస్తాను.

Monday, December 31, 2007

ఉమెన్

ఈ ప్రపంచంలో మనం మన జీవితంలో ఎన్నో రకాలుగా స్ఫూర్తి పొందుతాం. ప్రక్రుతి నుండి, పక్షుల నుండి, జంతువుల నుండి, ముఖ్యంగా గొప్ప వ్యక్తుల జీవితాల నుండి, అలా కలిగిన స్ఫూర్తి మన జీవితాలనే మార్చేస్తుంది. ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. నిజానికి మనం అలా ఆనందంగా, ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేకత కలగాలంటే ఖచ్ఛితంగా స్ఫూర్తి కలిగే విషయాలను గమనిస్తూండాలి. అలా నేను గమనించిన, నాకు స్ఫూర్తి కలిగించిన ఒక పుస్తకం డా.కెవిఎస్ మురళీ క్రిష్ణ గారు రాసిన "ఉమెన్ - హు ఇన్స్పైర్డ్ ది వరల్డ్". ఇందులో ఆయన ప్రపంచంలోని వివిధ రంగాలలో విజయం సాధించి, వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని, ఈ ప్రపంచానికే స్ఫూర్తిని కలిగించే ఎంతో మంది స్త్రీల గురించి తనదైన చక్కని శైలిలో వివరించారు, ప్రపంచ వ్యాప్తంగా ఎందరి నుంచో మంచి మార్కులు కొట్టేసారు. ఇది మహిళల గురించే అయినా అందరూ తప్పక చదవాల్సిన, అందరి డెస్కులో దాచుకోవాల్సిన పుస్తకం మీ కోసం ...

గడచిన కొన్ని శతాబ్దాలుగా, స్త్రీలకు ఎటువంటి హక్కులూ లేవు, చివరికి ఓటు హక్కు కూడా. ప్రపంచంలో మూడొంతుల పని స్త్రీల ద్వారానే జరుగుతుంది కాని వారికి ప్రపంచ సంపదలో ఏడు శాతం కూడా లభించదు. దేవుడు స్త్రీ, పురుషులను సమానంగానే తయారు చేసాడు. కానీ, చాలా మంది స్త్రీలకు తమను తాము నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా కలుగదు. కొంత మంది స్త్రీలు వారి పనుల ద్వారా వారిలో కాంతిని ప్రకాశింపజేస్తారు అంటే కాంతి అంత అద్భుతంగా పనులు చేస్తారు కాని వారు ప్రసరించిన కాంతి వెలుగులోకి రాదు, వెలుగునివ్వదు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. వారిప్పుడు అలా లేరు. అన్నింటిలోని ముందే వున్నారు, డ్రైవరు సీటును ఆక్రమించారు. అన్ని రంగాల్లో అంటే తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా,గణిత, సాహిత్య, సాంఘిక,రచన, రాజకీయ, చిత్రలేఖన, సంగీత,కళలు, ఇలా అన్ని రంగాల్లోను ముందుకు దూసుకుపోతున్నారు, ముందు వరుసలో ఉంటున్నారు. ఈ పుస్తకంలో మనం అటువంటి పాత్రలను తమ నిజ జీవితంలో పోషించిన ఎంతో మంది స్త్రీలను చూడగలము. కాని, కొంతమంది అల్ప మానవులు మాత్రం స్త్రీలు దయ, ఓర్పు, సహనం, బాధను భరించే, పతులకు సేవ చేసే, పిల్లలను పెంచే కొన్ని క్వాలిఫికేషనుల కోసమే చదువుతున్నారంటూ, వారిని, వారి చదువుని కూడా అంటూంటారు, ఇంకా ఈ సమాజంలో స్త్రీ పాత్ర ఏమీ లేదు, వారు ఏమీ కాలేరు అంటూ అనడమే కానీ, అలా అంటూ వారేం కోల్పోతున్నారో అర్థం చే సుకోరు.

కనుక, ఇక్కడ పురుష జాతి స్వభావాన్ని మార్చుకోవడమనేది ముఖ్యం కాదు కానీ స్త్రీల పట్ల అనుకూల భావనను కలిగి వుండాలి, వారిలో దాగి ఉన్న ప్రతిభను ఒప్పుకోవాలి. 19వ శతాబ్దంలో, స్త్రీలకు ఎటువంటి అవకాశం ఇవ్వబడలేదు, ఎంతో నీచంగా చూడబడేవారు. కానీ, 21వ శతాబ్దంలో, స్త్రీ పాత్రలో ఎంతో పెరుగుదల, వారు నెమ్మదిగా, నిదానంగా ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా ఈ సమాజంలో వారికంటూ ప్రత్యేక స్థనాన్ని ఏర్పరచుకున్నారు. అలా స్థానాన్ని, విజయాన్ని దక్కించుకున్న కొంత మంది స్త్రీల జీవితాలు నిజంగా ఒక్కరినీ, ఇద్దరినీ కాదు, ఈ మొత్తం ప్రపంచానికే ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం. కొత్త ఆలోచనలను, జీవిత సరళిని మార్చారు కొంత మంది స్త్రీలు, మరి కొంత మంది తత్వవేత్తలు, తిరుగుబాటుదారులుగా, ఇంకొందరు శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, నాయకులు, పాలకులు, ధైర్య, ధీరశాలురుగా, ఇంకొందరు క్రీడల్లో, రచనల్లో ప్రతిభను చూపితే, మరికొందరు కళలలో,నటనలో, అందంలో కూడా తమ ప్రతిభను చాటుకున్నారు. వారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఎంతో చక్కగా ఆలోచించి, జీవన సరళిని మార్చుకుని, తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా చేసిన యశోధర, సిద్ధార్థుడి భార్య. ఒక కొడుకు పుట్టిన తరువాత సిద్ధార్థుడు తన కుటుంబాన్ని వదిలి బుద్ధుడిగా మారితే, యశోధర తన కొడుకుని చక్కగా పెంచి, మంచి బుద్ధులు చెప్పి, తరువాత ఆమె కూడా సన్యాసం తీసుకుని, బౌద్ధ మతంలో మొట్టమొదటి సన్యాసినిగా చరిత్రలో నిలిచింది. ఆమె ఎప్పుడూ తన కొడుకు రాహులాకు "ప్రపంచంలో అందరూ మరో జన్మ వద్దనుకుంటే, సుర్యచంద్రులతో సహా, అప్పుడు ఈ ప్రపంచం ఏమవుద్ది? అందుకే సుర్యచంద్రుల్లాగే ఎప్పుడూ జీవిద్దాం, ప్రపంచానికి 365 రోజులు, 24 గంటలు వెలుగునిద్దాం, అలా జన్మిస్తూనే ఉండాలి," అని చెప్పేది. యశోధర తత్వాన్ని మైథిలి శరన్ గుప్త్ రాసిన చాల పుస్తకాల్లో తెలుసుకోవచ్చు.

తరువాత, ఆండర్సన్ ఇ గారెట్, మొట్టమొదటిగా వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన గొప్ప మహిళ. ఆమె స్త్రీల హక్కుల కోసం కూడా పోరాడి గెలిచింది. ఆన్నిబీసెంట్, భారతీయ సంస్క్రుతీ, ఆచారాలు,తత్వానికి ఆకర్షితురాలై భారతీయురాలిగా మారిపోయింది. ఎన్నో ఉద్యమాల్లో పాల్గుంది. ఆమె ప్రత్యేకంగా హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి చరిత్రలోనే తను ఒక పుట సంపాదించుకుంది. మనకందరికీ తెలుసు కిరణ్ బేడీ,భారత ఉక్కు మహిళ, మన దేశంలో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్. నిజానికి తాను ఐఏఎస్ కావాలనుకుంది కానీ దాంట్లో ఎంపిక అవకుండా ఐపిఎస్కు ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె ఈ వ్రుత్తిని ఒక సవాల్గా తీసుకుంది, మంచి పేరు సాధించింది. ఆమె ఎన్నో అద్భుతమైన రచనలు కూడా చేసింది. "నవ జ్యోతి" అనే పేరుతో సాంఘిక సంస్థను స్థాపించింది. ఆమె విజయానికి గల కారణం మనకున్న భయాలను వదిలేస్తే మనం సాధించనిదంటూ ఏమీ లేదనే సిద్దాంతంపై ఆమెకున్న నమ్మకమే. నిజమే కదా. ఇక, ఇప్పుడు మహిళలందరూ తమకున్న ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాని వారికా హక్కు ఎలా వచ్చిందో తెలియదు. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మిసెస్ ఎమిలైన్ పాంకరస్ట్, ఆమె కూతురు క్రిస్టాబెల్లు ఈ మహిళా ఓటు హక్కు కోసం ఎంతో శ్రమ పడి, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి స్త్రీలు ఏ పనైనా చేయగలరని నిరూపించి, 1918లో 30 సంవత్సరాలు పై బడిన స్త్రీలకు ఓటు హక్కును సాధించారు. 1928లో మాత్రమే, దానిని 21 సంవత్సరాలకు తగ్గించారు. మరి వీరి గురించి మనం తెలుసుకోవాలి కదా.

ఇక మనందరికీ తెలిసిన గొప్ప స్త్రీ హెలెన్ కెల్లెర్. ఆమె పూర్తిగా గుడ్డిది, చెవిటిది అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా, బ్రైయిలీ లిపిలో చదవడం, రాయడం నేర్చుకుని, కేంబ్రిడ్జ్లో, ఇంగ్లీష్లో గ్రాడ్యేషన్ పూర్తి చేసి తెలివైన విద్యార్థిగా నిరూపించుకుంది. ఇంకా ఎన్నో రచనలు కూడా చేసింది. మనకు ఎన్నో లోపాలను కలిగించినా వాటికి ఒక కారణం ఉంటుంది అంతేకాక దాని బదులుగా ఆ దేవుడు మనకు ఖచ్ఛితంగా మరో ఉన్నత, ఉత్తమ లక్షణాన్ని ఇస్తాడు. జీవించడమంటే ఇవ్వడమని ఆమెకు తెలుసు. మనం ఏవి సంపాదించినా, అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. మనతో వుండదు. మనం సమాజానికి ఏదైతే ఇస్తామో అదే శాశ్వతం, అదే మనకు జీవితానిస్తుంది. అది ఎంత చిన్నదైనా, తక్కువైనా అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. కనుక, మంచిగా వుంటూ, సమాజానికి ఎంతోకొంత సేవ చేద్దాం. మనం మన జీవితం గురించి, సమాజం గురించి ఆలోచించాలి, మన జీవితంలో ఎన్నో ఇచ్చిన ఆ దేవునికి క్రుతజ్ఞత చెప్పాలి., చివరికి మనం చేసిన దానం మనలో నవ్వుల్ని పూయిస్తుంది. అస్తమించే సూర్యుడు,"ఇప్పుడు నా పనెవరు చేస్తా," రని అడిగితే, చిన్న కొవ్వొత్తి వెలుగు,"నాకు సాధ్యమయ్యేంత వరకూ నేను చేస్తాన"ని చెప్తుంది. మనం కూడా ఆ కొవ్వొత్తిలా జీవిద్దాం.

ఇక శాస్త్రజ్ఞుల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది మేడం క్యూరి. మానవుల్లో, అది, స్త్రీ ఐనా, పురుషులైనా, ప్రపంచంలోనే నోబెల్ బహుమతిని రెండు సార్లు అందుకున్న గొప్ప మహిళ. ఆ రోజుల్లో ఒక స్త్రీ సైన్స్ రంగంలో వుండడమనేది ఊహాతీతం. కానీ,సైన్స్ పరిశోధనలో ఆమెకున్న ఆసక్తే ఆమె విజయనికి దోహదపడింది. ఆమె పెళ్ళి తరువాత కూడా, తన భర్త, తాను కలిసి రేడియో ధార్మిక మూలకాలను కనిపెట్టారు. అది కాన్సర్ నిర్మూలనకు ఉపయోగపడింది. అందుకే ఆమె నోబెల్ బహుమతిని సాధించింది. రోజుకు 18 గంటలు పని చేసి, 8 సంవత్సరాల తరువాత కెమిస్ట్రీలో పరిశోధనకుగాను ఆమెకు రెండవ సారి నోబెల్ను ప్రధానం చేసారు. మిసెస్ మేరీ లావోయిసెర్, ఆధునిక కెమిస్ట్రీకి పితామహుడైన లావోయిసెర్ భార్య నిజంగా ఒక స్త్రీగా, ఒక భార్యగా ఎప్పుడూ ఆమె భర్తను ప్రోత్సహిస్తూ, అతని మరణం తరువాత కూడా అతను రాసిన రచనలను పుస్తకాలుగా ప్రచురించి, పబ్లిష్ అయ్యేలా చేసింది. ఆ శాస్త్రవేత్త గొప్పతనాన్ని ప్రపంచమంతటికీ చాటింది. ఎప్పటికీ అతనే గొప్ప ఫ్రెంచ్ శాస్త్రవేత్తగా కొనియాడబడ్డాడు. ఇప్పుడు స్త్రీలు భార్యలుగా ఎంతవరకూ తమ భర్తల జీవితం, పిల్లల జీవితం గురించి ఆలోచిస్తూ, తమకి తాము ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు? ఏదో ఒకటే చేస్తున్నారు. వారిని వారు నిరూపించుకోవటంలేదు. మేరీ లావోయీసెర్లా క్రుషి చేస్తే వారి జీవితం కూడా వెలుగులోకి వస్తుంది. వారికీ ఒక ప్రత్యేక పేజి కేటాయించబడుతుంది. ఎందుకంటే ప్రతీ మగవారు వారు చేసిన పనిని ఒక నిచ్చెన ఎక్కినట్టుగా భావిస్తే, వారు కిందికి చూస్తే కింద ఒక వ్యక్తిని చూడగలరు, ఆ వ్యక్తే "భార్య".అందుకే ప్రతీ పురుషుని విజయం వెనుకా ఒక స్త్రీ వుంటుందనే మహత్తర సత్యం లావోఇసర్స్ వల్లే వెలుగులోకి వచ్చింది. కనుక, ఏది చేసినా, ఏం జరిగినా అందులో స్త్రీ పాత్ర ఖచ్ఛితంగా వుంటుందనడానికి వెనుకాడాల్సిన పని లేదు.

తరువాత చెప్పుకోవాల్సిన వారు శకుంతలాదేవీ, గణిత ప్రావీణ్యురాలు. ఆమెను నవ కంప్యూటెర్గా వరిగణించారు. గణిత శాస్త్రంలో ఆమెకున్న పట్టు ఆమెకు గిన్నీస్ బుక్లో స్థానమిచ్చింది. ఇక సాంఘిక సంస్కరణల విషయంలో, ఫ్లోరెన్స్ నైటేంగిల్ సమాజానికి చేసిన సేవ చెప్పుకోదగింది. ఆధునిక నర్సింగ్ని స్థాపించిన ఫ్లోరెన్స్ నర్సింగ్పరంగా ఎంతో సేవ చేసింది. ఆమె తన అవసరాలను, సౌకర్యాలను త్యాగం చేసి, కేవలం అనారోగ్యంతో భాదపడే వారికి సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసింది. రాత్రి వేళల కూడా ఆమె దీపాన్ని పట్టుకుని రోగులకు చికిత్స చేసేందుకై వెళ్ళేది. అందుకే ఆమె "ది లేడీ విథ్ ది లాంప్" గా పేరు పొందింది. పేషెంట్లు ఆమె నీడను సైతం చూసి చలించిపోయేవారు, ఎంతో ఆప్యాయతతో చూసేవారు. తరువాత చెప్పుకోవాల్సిన వారు మనకందరికీ బాగా తెలుసు మదర్ థెరిస్సా. ఆమె సమాజానికి చేసిన సేవ చిరస్మరణీయం, ప్రతీ స్త్రీ ఒక మదర్ థెరిస్సా కావాలనుకునేంత స్ఫూర్తిని కలిగించారు. ఒక మంచి పనిని చేయడాన్ని వాయిదా వేయద్దు. జీవితం చాల చిన్నది, ఇప్పటికే ఆలస్యమైంది. లేద్దాం, కాలాన్ని ఉపయోగిద్దాం, విజయం మనదే. ఇక మనకందరికీ తెలుసు ప్రపంచ ధనవంతుల్లో మొదటి పది మందిలో ఒకరు, ఆసియా ఖండంలో పది మంది ప్రముఖుల్లో ఒకరు, "ఇన్‌ఫోసిస్" అధినేత ఎన్ ఆర్ నారాయణ మూర్తి గారు, ఆయన వెనుక ఒక స్త్రీ ఉన్నారు, ఆమె వారి భార్య సుధా మూర్తి. టాటా టెల్కొలో పని చేసిన మొట్టమొదటి మహిలా ఇంజినీర్. 1000 స్కూళ్ళకు, 4000 లైబ్రరీలు, అనేక మంది పిల్లలు, స్త్రీ విద్యా కార్యక్రమాలకు ముఖ్య పోషకురాలు ఆమె, మంచి రచయిత్రి కూడా. ఆమె రాసిన "గ్రాండ్మా కథలు" అందరూ చదవాల్సిన పుస్తకం.

గొప్ప దేశభక్తులు కూడా ఉన్నారు. అలా చూస్తే ఝాన్సీ రాణీ లక్ష్మీ భాయిని మించిన వారెవరూ లేరు. ఆమె చిన్నప్పుడే గుర్రపు స్వారీ, యుద్ధ కళలు నేర్చుకుంది. తన 8వ ఏట వివాహం చేసుకుని ఝాన్సికి రాణి అయింది. తన భర్త, కొడుకుల మరణం తరువాత బ్రిటీష్ వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే లక్ష్మీ భాయ్ వేరే పిల్లాడిని దత్తత చేసుకుని , తన దేశం కోసం పోరాడి, బిడ్డను తన వెనుకకు కట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి, వారితో యుద్ధం చేసింది. ఆమె ధైర్యానికి బ్రిటీష్వారు ఆశ్చ్ర్యపడినా వెరే దారి లేక ఆమెను చంపితే గానీ రాజ్యం రాదు కనుక ఆమెను చుట్టు ముట్టారు. యుద్ధ భూమిలోనే ఆమె వీర మరణం చెందింది. తరువాత చెప్పుకోవల్సిన మహత్తర మనిషి, దేశ భక్తురాలు, రచయిత్రి, "భారత నైటింగేల్ " సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు. ఎన్నో పుస్తకాలను కూడా రచించారు. దేశభక్తితో దేశానికి మంచి చేయాలని, దేశానికే అధ్యక్షులయారు ఇందిరా గాంధి, ఎవరూ మర్చిపోని, ప్రతీ స్త్రీ ఆదర్శవంతంగా తీసుకోవల్సిన వ్యక్తి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎంతో మంది స్త్రీలు తమ దేశాలను పాలించారు. బెనజ్జీర్ బుట్టొ, క్వీన్ విక్టోరియా, సోనియా గాంది ఇలా అందరూ స్త్రీలే.

కల్పనా చావ్లా, పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దైర్యం. అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళ. కొన్ని రోజులు ఆమె అక్కడ ఉండి, ఎన్నో ఆపరేషన్లు నిర్వహించి అన్నింటా విజయం సాధించి స్త్రీలు ఏ విష్యంలోను తక్కువ కాదని, ఏ పనైనా చేయగలరని నిరూపించారు. కొంతమందికి మరణం ఉండదు. అలాగే కల్పనా చావ్లా కూడా. ఆమె భౌతికంగా మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా అందరి హ్రుదయాల్లో, పుస్తకాల్లో ఆమెకు శాశ్వత జీవం, జీవితం ఉంటుంది. ఎందుకంటే మనకు గొప్ప లక్ష్యాలు సాధించాలన్న తపన ఉంటే, తప్పకుండా సాధిస్తాం. అలా సాధించినపుడు, సాధించేటప్పుడు మరణించినా, అది నిజమైన మరణం కాదు, నిజానికి అప్పుడే మన జీవితం ప్రారంభమౌతుంది! అదెలాగో మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. సునీతా విలియంస్, క్రిస్టినా డాడ్వెల్ ఇలా ఎందరో సాహస వనితలు మన దేశంలో, మన ప్రపంచంలో జన్మించారు. కొంతమంది వెలుగులోకి రాకపోయినా మన మధ్యనే ఉండి ఉంటారు, మనం వారిని వెలుగులోకి తెద్దాం, తేవడానికి ప్రయత్నిద్దాం.

అంతేకాక, క్రీడల్లోనూ స్త్రీలు వారి సత్తాను చాటుకున్నారు. జీవితాన్ని అనందమయం చేసుకున్నారు. వారిలో టెన్నిస్ క్రీడాకారిణి, క్రిస్ అవెర్ట్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మరెవరు సాధించుండరేమో. ఆమె టెన్నిస్ నుండి రెటైర్ అవుతునప్పుడు 20,000 మంది పైగా అభిమానులు బాధపడ్డారు, కన్నీరు పెట్టుకునారు. ఎంత ఆశ్చర్యం? మనం ఆ విధంగా స్ఫూర్తి పొందాలంటే చాలా మంది క్రీడాకరులు ఉన్నరు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి విల్మా రుడాల్ఫ్. ఆమె పుట్టడమే 2 కేజీల కన్నా తక్కువ ఉంటూ, తరువాత కూడా అనేక సమస్యలతో బాధ పడింది. నిజంగా అలా ఎవరికీ జరగదేమో. తరువాత ఆమె ఎడమ కాలు పూర్తిగా నాశనమైంది. డాక్టర్లు ఇంకెన్నడూ ఆమె నడవలేదని తేల్చేశారు. ఆమె జీవితం ప్రతికూలాంశాలను సాధించిందని చెప్పొచ్చు. కానీ ఆమె అధైర్య పడకుండా ముందుగా జీవించాలనుకుంది. తన స్కూలు రోజుల్లోనే బాస్కెట్ బాల్ లో ప్రథమ స్థానం పొంది, తరువాత 16 సంవత్సరాల గ్రూప్లో ఒలింపిక్స్లో పాల్గొని, బ్రాంజ్ మెడల్ సాధించింది. విజయానికి ఎక్కడా అంతమనేదే లేదు, అది ముగింపు కాని గమ్య స్థానం. వివిధ అంశాల్లో మూడు బంగారు పతకాలను సాధించిన మొదటి అమెరికన్ స్త్రీ. ఆమె విజయానికి కారణం, ఆమె సాధించాలన్న కల. ఆమె ఆ కలను ఎప్పుడూ చెరగనివ్వలేదు. దాన్ని నిజం చేసేందుకు, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్ట పడింది. ఒక ఆశ , నడవలేని మనిషిని కూడా పర్వతాలను ఎక్కేలా చేస్తుంది. అలా ఇక్కడ మనం ఓ సాధారణ గౄహిణి గొప్ప అథ్లెటై ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డ్ సాధించి, ఆ శతాబ్దానికే ఉత్తమ మహిళా అథ్లెట్గా కీర్తించబడింది. మనం సహనాన్ని కోల్పోతే, అంతా కోల్పోతాం. ఓడిపోయేవాడు ఎప్పుడూ గెలవడు, గెలిచేవాడు ఎన్నడూ ఓడడు. ఇలా మనం మార్టినా నవ్రతిలోవా, పీ.టీ.ఉషా, సానియా మీర్జా ఎంతో మందిని చూడవచ్చు, స్ఫూర్తిని పొందవచ్చు.

తమ రచనల ద్వారా కూడా స్ఫూర్తిని నింపుతూ, తద్వారా ఆ రచనలు చేసిన వ్యక్తులనే స్ఫూర్తిగా తీసుకునేలా వుండే వ్యక్తులు అని ఫ్రాంక్, ఆమె రాసిన డైరి 19 భాషల్లో ప్రచురించబడి, రెండు మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి అంటే అది ఎంత ప్రభావితపరిచే రచనో. ఇల ఎంతో మంది స్త్రీలు వారి రచనలను మనకందించారు. జె.కె.రౌలింగ్- హ్యారి పాటర్, కమలా దాస్ - తన జీవిత చరిత్ర, "మై స్టోరీ" , మేధా పాట్కర్ - సాంఘిక, పర్యావరణాలపై చేసిన రచనలు, హిందూ వేదాంతం, హిందూ దేవతలపై, తోరూ దత్ చేసిన రచనలు నిజంగా అద్భుతం. లతా మంగేష్కర్, గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రపంచ గిన్నీస్ బుక్లో కూడా స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రతీ రోజూ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట, ఏ మూలనో ప్రతీ సెకను, ప్రతీ నిముషం లేదా రోజంతా ఆమె గొంతుని పాటల రూపంలో వింటూనే ఉంటాం. ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి గారి సంగీతం కూడా చాల మందిని ప్రభావితం చేయగలదు. ఏక్తా కపూర్, అమ్రితా షెర్గల్, ఇలా చాలా మంది తమ కళల్లో పేరు సంపాదించుకున్నారు. అందంలో, అందంతో కూడా డయాన,క్లియోపాత్ర, సమతా ఫాక్స్, ఎలిజిబెత్ టేలర్, హేమా మాలిని, నర్గిస్ దత్, మడోన్నాలు ప్రపంచ చరిత్రలో తమ మార్కును వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇంకా మనం రుక్మిణీ దేవీ అరుంధల్, గొప్ప థింకర్, సిరిమావొ బండారు నాయక- ప్రపంచ మొదటి మహ్ళా ప్రధాన మంత్రి, భారత దేశంలో మెరుగులు దిద్దుకున్న జయ లలిత, మేనకా గాంధి, ప్రియా టెండూల్కర్, ప్రియాంకా గాంధీ, మిథాలీ రాజ్, వసుంధరా రాజే వంటి గొప్ప స్త్రీలను చూడవచ్చు, వారిలా మనమూ కావచ్చు. ఇన్సులిన్ నుండి అనేక యాంటీ బయాంటిక్స్ను ఉత్పత్తి చేస్తూ, ఫార్మా రంగంలోనే 1000 కోట్ల టర్నోవర్ను చేస్తున్న కిరణ్ మజూందర్ షా, మొదట్లో డాన్స్ తప్పా ఏమీ నేర్చుకోక, ఇద్దరు పిల్లల తల్లయిన ప్రీతా రెడ్డి, ఇప్పుడు అపోలో గ్రూప్ హాస్పిటల్లకు నిర్వాహక కార్యదర్శి, షబానా ఆజ్మి- ప్రఖ్యాత సినీ తార, అరుంధతీ రాయ్, భరతీయ ఆంగ్ల రచయిత్రీ, బృందా కారత్, స్త్రీ ఉద్యమకారి అందరూ స్త్రీలే, స్ఫూర్తిమంతులే.

ఆ దేవుడు స్త్రీ జాతికిచ్చిన వరాలు రెండు. ఒకటి మాతృత్వం, రెండు అందం. కొన్ని ప్రతికూలాంశాలనూ ఇచ్చాడనుకోండి. వాటిని మనం ఈ పుస్తకం చివరి పేజీల్లో చూడవచ్చు. కానీ, వాటిని అనుకూలంగా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా స్త్రీ, పురుషులు ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. అందరూ సమనమే. మనది పురుష జాతీ కాదు, స్త్రీ జాతీ కాదు, అలా అని మానవ జాతీ కాదు.మనది జంతు జాతి. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు. మనందరం ఈ సజీవ నిజాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలన్న మురళీ కృష్ణగారి మాటలతో నేను ఏకీభవిస్తాను. "ఉమెన్ " పుస్తకం చదివితే మీరూ ఏకీభవిస్తారు.

Monday, November 26, 2007

సూర్యుడు వస్తూ వెలుతురును తెస్తాడు
వెళ్తూ ఆ వెలుతురును తీసి చీకటినిస్తాడు
చంద్రుడు వస్తూ ఆ చీకటికి వెలుగు తెస్తాడు
వెళ్తూ వెలుగును కాస్తా వెలుతురు చేస్తాడు
అందుకే చంద్రుడు చందమామై అందరికీ నచ్చుతాడు.

ఉషా కిరణాలు

అనుదినం ఉదయించే ఉషా కిరణాలు
అందరికీ ఇష్ట్పడతాయి ఆ కిరణ కాంతులు
నింపుతాయి అందరి మనసులో వింత వెలుగులు
ఆ వెలుగులు చూపుతాయి సరిక్రొత్త బాటలు.....

Monday, November 19, 2007

కవితలు కేవలం మాటలే కాదు, మనసులోని భావాలు. మనసుతో అలోచించే శక్తిని కల్పించడానికి, చైతన్యాన్ని రగిలించడానికి, మనల్ని మనం దిశా నిర్దేశం చేసుకోడానికి ఝులిపించే పదునైన బాణాలు అనుటలో అతిశయోక్తి లేదు. ఆ భావాలు సామాజిక మార్పుకుపయోగపడతాయని నిరూపించేలా ఉంది 'జనసాహితి ' అందించిన "నూరు అలల హోరు" (ప్రజా సాహితి కవితలు). కేవలం ఒక భావ కవిత ఎంతో మర్పును తెచ్చి ఆలోచనలో పడేస్తుంది. అలాంటిది వెర్వేరు కవులు వ్యక్తిగతంగా, సామాజికపరంగా అందించిన వివిధ కవితలను ( వందకు పైగా) మనముందుంచి కవితా ప్రయోజనాన్ని పాఠకులూ తెలుసుకోవాలనే చిన్న ఉద్దేశంతో---


డా. బి.సూర్యారావ్ గారు రాసిన 'జెండా 'కవిత మొట్టమొదటిగా పాఠకుల మనస్సుకు హత్తుకుని వందనం చేయాలనిపించేలా ఉంది. జెండాను నిలబెట్టడమే కాదు, దాన్ని ఎగురవేసిన వాడు జెండాలాగే నిలువగలగాలి అన్న ఆయన మాటలు మన ఆశయాన్ని తెలొయజేసేలా వుంది. తరువాత ఉపాధ్యాయుల ధ్యెయాన్ని, ఏదైనా వారి చేతుల్లోనే వుందంటూ, తరగతి గదే వారికి ఆయుధమని ' కొత్తపల్లి రవిబాబు ' గారు చక్కగా వ్యక్తపరిచారు ' తరగతి గది నా తుపాకీ ' లో. ఏవరెన్ని ఆంక్షలు విధించినా భయపడకుండా, చేసే పనిని ఆపకుండా, అక్షరాలనే ఆయుధంగా చేసి రగిలించక తప్పదంటూ 'అల ' గారు రాసిన కవిత అక్షరాలకే లక్ష్నంగా ఉంది, రాయడం ఆపకూడదనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.

కవితలు ఆలోచనల్లో పడేస్తాయి. ఆ ఆలోచన మీద కవిత రాస్తే ఎంత బావుంటుందో 'ఆశా రాజు ' గారి కవిత ద్వారా తెలుసుకోవచ్చు. 'మనిషి ఆలోచనల్ని ఎలా బంధిస్తావ్ ఆలోచనంటే నిప్పు కదా - ఆలోచనంటే సముద్రపు హోరు కదా
ఆలొచన ఎవడి చేతికి చిక్కేది కాదు - ఎవడి కాళ్ళకి మొక్కేది కాదు
ఆలోచనంటే సమస్త భూమండలం - ముంచెత్తే వాయుగుండం
ఆలోచనంటే మనిషి పిడుగవటం - మంటవ్వటం
మనిషినైతే బంధించొచ్చు కానీ ఆలోచన్ల్ని ఎలా నిషేధిస్తావ్?" అన్న ప్రశ్న రేకెత్తిస్తుంది అందరి గుండెల్లో ఆలోచనను. మరి కొంత మంది కవులు తాము తెలుసుకున్న విషయాలకు స్పందించి సూటిగా, ఘాటుగా రాసిన వాటినీ చూడొచ్చు. అందుకు ఎ. మురళీక్రిష్ణ ' గారు ఖలిస్తానీ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన పాష్ అనే కవి సంస్మరణ కోసం రాసిన 'మరణం లేని అక్షరం ', చాయ్రాజ్ ' కొత్త రాగం ' కాకరాల గారు విన్నాక అభినందించేందుకు రాసిన ' భళే బాగుంది బొమ్మ ' , శాంతి - ప్రజాస్వామ్యాల కోసం ఏర్పడిన భారత - పాకిస్తాన్ ప్రజా వేదికకు వెళ్ళే దారిలో తన భావాలను కవితా రూపంగా చేసిన దివికుమార్ గారి 'ఉద్విగ్న క్షణాలు ' , కరీమ్నగర్ పోలిసుల అఘాయిత్యానికి రాజన్న గారి ప్రతిస్పందన 'ప్రక్రుతి విరుద్ధం ', అగ్రరాజ్యం చిన్న దేశాల మీద చేస్తున్న దౌర్జన్యానికి నిరసనగా వర్రే రాణి గారి 'ఎదురు దాడి ' లను ఉదాహరణలుగా చెప్పొచ్చు.


"ఓడిపోతాం .... గెలుస్తాం, ఓడిపోతూనే గెలుస్తాం, ఓటమిలోంచి గెలుపై మొలుస్తాం, మేం కొండ మోడులమై మళ్ళీ .. మళ్ళీ... చిగురిస్తూనే వుంటా" మంటూ పిడుగురాళ్ళ ప్రంతం కొండమోడులో పోలిసులు, ఫారెస్టధికారులూ కలిసి మూడు సార్లు కూల్చేసినా, తిరిగి ఇళ్ళు నిర్మించుకున్న ద్రుశ్యానికి పై విధంగా స్పందించి శ్రీ హరి గారు రాసిన "కొండ మోడు చిగురిస్తూనే వుంటుంది!" లో ఆయన భావాలు కొత్త ఆశలను, కవిత్వం మీద ఇష్టాన్ని చిగురించేలా చేస్తాయి.


ప్రక్రుతే అందం, ప్రక్రుతిలోని ప్రతీ వస్తువు అందం. అందులో సముద్రం, ఏదో చేరుకోవాలనే ఆరాటంతో ఎంత దిగినా అంతే ఎత్తుకు ఎదగాలనే ఒక స్ఫూర్తిని రగిలిస్తూంటే ఆ సముద్రంలో ఎగసిపడే అలలు, అల్లంత దూరాన కలిసిపోయాయా అన్నట్టు కనిపించే సముద్రం, ఆకాశంలో మబ్బులు, బీచ్లో కాళ్ళ కింద ఇసుకను ఎలా మర్చిపోగలం. ఇక అక్కడ వెలిగే ఆ శోభను పై పై చూడకుండా, చూపును కొంచెం వేరు చేసి చూడమంటూ, అందులో వుండే ఉప్పెనను ఉద్వేగం చేయమంటూ, జీవితాల్ని చెరువును తవ్వినట్టు తవ్వీ తవ్వీ సముద్రాన్ని నిలబెట్టమంటూ, ఆ అలల్నీ, అలల్లో కలల్నీ, కలల్లో మహోపాన్యాస విన్యాసాల్నీ లెక్కపెట్టమంటూ క్నదుకూరి శ్రీ రాములు గారి "సముద్ర సభ" ప్రక్రుతికే శోభ.

విదేశీ ఫ్యాషన్లకలవాటుపడిన ప్రజలు చేనేత విలువలను తగ్గించి, ఆ వర్గాల వారికి పూర్తిగా అన్యాయం చేస్తుంటే, ప్రభుత్వం కూడా కెవలం వారిని ఓటర్లుగానే గుర్తిస్తుందే కానీ వారి ఆకలి భాదలను గుర్తించట్లేదు. వారి ఓట్లతో నాయకులు పదవుల్లో వుంటున్నారు. మరి ఆ ఓటర్లూ, పిరికి ఊహలతో గొంతు నులుముకుని ఈ వ్యవస్థకు ఆహారమై అరిగిపోతున్నారని చల్లా విశ్వనాధంగారు "మగ్గం కొయ్యపై చేనేత తనువులు" లో కనుమరుగౌతున్న చేనేత వర్గాల కళా స్రుష్టిని కళాత్మకంగా కవితా రూపాంతరం చేశారు. నేడు ఈ సమాజంలో జరుగుతున్న దారుణాల్లో ఒకటి రైతుల ఆత్మహత్యలు. ఏదో పండించాలని, ఎంతో సంపాదించాలనే ఆశతో, వున్న డబ్బుల్ని తగలేసి, వున్న బంగారాన్ని తాకట్టు పెట్టి, వున్న అవసరాలకై కాడి కింద ఎద్దులా, కన్నీరు కార్చి, కన్న కలలన్నీ కల్లలైనప్పుడు, చేసేదేంలేక బూడిధ పాలైన ఈ రైతే, అసమర్థ ప్రభుత్వాన్ని అంతం చేయడానికీ, ఈ దోపిడీ వ్యవస్థను కూల్చి వేయడానికీ, "మళ్ళీ మళ్ళీ రైతుగానే మొలకెత్తుతా" డని పుప్పాల మట్టయ్య గారు స్పందించిన తీరు, మనిషి కన్నా వస్తువులకే నేటి ప్రపంచంలో విలువ పెరిగిందంటూ, ఆప్యాయతల్ని పెట్టుబడిగా, అభిమానాల్ని ఉత్పత్తులుగా, శ్రమను నిత్యావసర జాబితాల్లోకి చేర్చేస్తూ, మానవ సంబంధాలన్నీ వస్తు సంబంధాలయ్యాక ఇంకేం మిగిలింది, మనుషుల్ని హాలు మధ్యలో శిలల్ని చేసేస్తున్నరన్న చేదు నిజాన్ని బండ్ల మాధవరావు గారి "వస్తు ప్రవాహంలోంచి..." ఒప్పుకోక తప్పదు.

ఇక మరికొంత మంది తమ అందమైన భావాలను సొంత భావాలతో కలబోసి రాసిన కవితలు భూమి, చెట్టుం నది, దేశం, విప్లవం, మారుతున్న సమాజం, సమ్మజంలోని తీరు, వ్యక్తిగత భావాలు, ప్రక్రుతి గురించి వర్ణనలు, జరుగుతున్న అన్యాయాలు, ఒకటేమిటి కాదేది కవితకు అనర్హమనే విధంగా, తలుచుకుంటే ఆలోచనను ఆచరణ చేయొచ్చు, ఆ ఆచరణలను కవితల ద్వారా పెంపొందించుకోవచ్చనే విధంగా వున్నాయి. ఎంపిక చేసి మరీ అమర్చిన ఈ కవితా సమాహారాన్ని మనమందరం ఒక్కసారి చదవక తప్పదు, చదివాక విశ్లేషించుకోక తప్పదు, వీటిని మనకందించిన వారికి క్రుతజ్ఞత చేయక తప్పదు.
ఈ నూరు అలల హోరు

నూరు మనుషుల తీరు

వారి భావాల జోరు

చేద్దాం వాటికి జోహారు.....

నా భావం

మనసు అనేది మహా సముద్రం
ప్రేమతో నిండిన అలల ప్రవాహం

ఒక్క క్షణం ఎగసిపడే కెరటం
మరు క్షణం అంతా నిశ్శ్బ్దం

కొందరికి తెలియనిది ఆ భావం
అల్పులకు ఎప్పటికీ కాదు అర్థం...

నిజం

ఒక ప్రయోగం నేర్పుతుంది ఎన్నో పాఠాలు......
ప్రతీ పాఠం తెలుపుతుంది ఎన్నో సత్యాలు!

ఒక హ్రుదయం పలుకుతుంది ఎన్నో రాగాలు......
ప్రతీ రాగం కలిగి ఉంటుంది ఎన్నో కావ్యాలు!

ఒక నయనం చూపుతుంది ఎన్నో భావాలు.........
ప్రతీ భావం వివరిస్తుంది ఎన్నో అర్థాలు!

ఇవి ఎవరికి అర్థమవుతాయి?
మనసుతో ఆలోచించే వారికి తప్పా!!!!!!