Friday, February 22, 2008

చిట్టి చేతులు

మన సంస్కృతి, కట్టుబాట్లు, అలవాట్లు ఇలా అన్నింటి పైనా నిశ్శబ్ద ఆంక్షలు విధిస్తున్న కనిపించని రూపం "ప్రపంచీకరణ", జరుగుతున్న కాలం ఇది. ఈ నేపథ్యంలో అణగారిన్, అట్టడుగు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు విద్యకు ఏ రకంగా దూరమైపోతారోనని ఆందోళన చెందుతున్న ప్రముఖ విద్యావేత్త 'చుక్కా రామయ్యా గారు బడికి రాని పిల్లలపై దృష్టి సారించి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని పాలకులు చెప్పిన మాట్లని ఆచరణలో ఎందుకు అమలు జరపలేకపోతున్నారన్న విషయాన్ని ప్రశ్నిస్తూ, ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఎవో తూతూ మంత్రంగా పని చేస్తే సరిపోదని, ఇందుకోసం ఓ మహత్తర ఉద్యమాన్ని కొనసాగించాలని, లేదంటే వీధి పిల్లల్లేని, బాల కార్మికుల్లేని సమాజాన్ని నిర్మూలించలేమని, మనకంటే వెనుకబడిన దేశాలు ఈ పనిలో ఏ పని విధానాన్ని ఎంచుకున్నారో, అందుకోసం ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, విద్యార్థులు, ఇలా అందరూ ఏ రకమైన భాగస్వామ్యాన్ని తీసుకోవాలో, ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచిస్తూ రాసిన పుస్తకం "చిట్టి చేతులు" అందరూ చదవాలనే ఉద్దేశంతో.....నేడు మనం అందరినీ, అంటే, దొర వాకిలూడ్చి, పశువుల కొట్టంలో పని చేస్తున్న చేతులను, బానిస బతుకులు బతుకుతునా చ్యక్తులను, శక్తులను, పెద్దలు చేసిన అప్పుకు వేలి ముద్ర వేసి జీవితాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్న వారిని, బడికి పోతానన్నందుకు చెంపపై చెల్లుమని దెబ్బ కాచిన అమ్మాయిలను ఇలా అందరినీ చదువుకోడానికి పిలుస్తున్నాం, చదువుకెళ్ళమని చెప్తున్నాం. వర్గం, కులం, మతం, లింగం, ప్రాంతం, వెనుకబాటుతనం అన్న అంశాలతో పోల్చి చూసినపుడు పేదరికం కూడా ఒక అంశమే కానీ మొత్తం పేదరికమే నిరక్షరాస్యతక్దు కారణం కాదు. బడికి రాని పిల్లవాడు బాల కార్మికుడేనా అన్నదానికి సమాధానాలు వెతకమంటారు. చదువుకోడానికి పిల్లలెందుకు బడికి రావడం లేదన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే, అసలెవరైనా చదువుకోడానికి, చదువుకోకపోడానికి కారణం సాంస్కృతిక నేపథ్యమే. సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలే చదువుని నిర్థారిస్తాయి, పరిసరాలే అక్ష్రాస్యతను నిర్దేశిస్తాయి. ప్రతి మనిషిలో ఒక మార్పుకు పాదు చదువు అనే దృక్పథం పెరిగితేనే, సకల వృత్తుల్లో బాల్యాన్ని కరిగిస్తున్న పిల్లలు బడికి వస్తారు. చదువుకుంటే పిల్లలు తమకు దూరమైపోతారేమో, చదివిన చదువుకు ఉద్యోగం దొరకదేమో, ఒకవేళ అలానే జరిగితే చాలా మంది అటు ఉద్యోగం దొరకక, ఇటు కులవృత్తులకు సంబంధించిన ఓనులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారేమోనన్న కొన్ని అపోహలు సామాన్య ప్రజల్లో తొలగిపోవాలంటారు. రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని స్వఛ్ఛంద సంస్థలు ఇంత కృషి చేస్తునప్పటికీ మనం వెనుకబడే ఉంటున్నాం, అయితే దీనిపై విశ్లేషణ జరగకపోవడం వల్లే ఇలా జరుగుతుందట. చాలా మంది అటు చదవక, ఇటు పనికీ వెళ్ళక ఉంటారు. మరి వారినీ బాల కార్మికులని ఎలా అనగలం? ఇలా పరిపరి విధాల విశ్లేషిస్తే జనాభా నియంత్రణను కూడా పరిగణించాలి, దీనిపై అట్టడుగు వర్గాల వారికి నమ్మకం కలిగించాలి. ఉన్న ఒక్క బిడ్డకి ఏదో చిన్న ఉద్యోగమైనా వస్తుందన్న భద్రత, ఆడపిల్లలు బడికి రావలసిన వసతులన్నింటినీ కల్పించాలి. ప్రపంచీకరణలో భాగంగా ప్రతి వసతువు తక్కువ ధరకు ఉత్పత్తి చేస్తే, బాల కార్మికుల సంఖ్య పెరిగిపోతుంది. తక్కువ ధరకు కూలీలు కావాలంటే పిల్లలే దొరుకుతారు. కాబట్టి ఈ వ్యవస్థను నిర్మూలించాలంటే మొదటి దశగా సామజిక, సాంస్కృతిక నేపథ్యాల నుంచి తొలచుకొస్తున్న బాధలను వాడికి పాఠాలౌగా చెప్తూ, తన బడి ఇల్లు అనుకునే పరిస్థితి తీసుకురావాలని సూచించారు.

అయితే, ఇంటి భాష లేకనే బడికి పిల్లలు దూరమవుతున్నారట. అందుకు నిదర్శనంగా రామయ్య గారు ఓ ఇంటి పిల్లవానిగా చాల చక్కని ప్రశ్నలు వేశారు. అగాథంలో ఎక్కడో వెనకపడ్డ వర్గానికి చెందిన ఒక పిల్లవాడు చదువుకున్నామని, జ్ఙానులమని తిరిగే వాళ్లల్లో ఎంత వరకు ఇముడ్చుకోగలడనే అనుమానం, మీరైనా మారాలి, లేక నేనైనా మారాలై, ఉభయుల కలయిక ఇంటి బడి కావాలంటూ, నేను మా శ్రమ సంస్కృతిని వదులుకునేందుకు సిద్ధంగా లేను, మీ చదువుల వల్ల నేను బాగుపడాలనే కోరిక మీకుంటే నా ఇంటి చదువు నాకిప్పించండంటూ మీ అక్ష్రాల ద్వారా, నా ఇంటి జ్ఞానం ద్వారా బాగుపడటానికి, బతకటానికి స్కూలుకు వచ్చేందుకు సిద్ధపడతాను, మీరే తేల్చుకోండంటూ, పెద్ద చదువులు చదివిన వారు మనుషుల్ని సక్రమంగా నడిపించలేక పడుతున్న పాట్లు అన్నిన్ని కావని, అజ్ఞానుల మాటల్లో రామయ్య గారు చక్కగా వివరించి, ఆలోచించేలా చేశారు. అయితే, పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు తమ వృతుల్లో సహాయపడడమనే భావంతో ఉండేవారు. ఇదో చక్కని బాంధవ్యంగా ఉండేది. కానీ, బ్రిటీష్ ప్రభుత్వం తమ పరిపాలనను కొనసాగించుటకై, భూమిపై తన ఆధిపత్యం సంపాదించి జమీందారీ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చినప్పటినుంచీ ఈ భాందవ్యాల మధ్య విఘాతం కలిగి, అదే బాల కార్మిక వ్యవస్థ పుట్టుటకు, వెట్టి చాకిరీకి కారణమయ్యింది, కానీ గ్రామీణ సంస్కృతి కాదని మనం తెలుసుకోవాలి. ఎక్కువ లాభాలను ఆశించి, పారిశ్రామిక వర్గం వారు తక్కువ ఖర్చుతో పిల్లలను పనిలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే, దీనికంతటికీ కారణం తెలుసుకోవాలి. బడికి పంపనందుకు తల్లిదండ్రులని సిక్షించాలా? బడికి రానందుకు పిల్లలను కోప్పడ్డాల? కానీ, లోతుగా పరిశీలించినట్లయితే దీనికి కారణమైన మహనీయులను శిక్షించాలి. కానీ, అది జరిగే పనేనా?(జరిగితే ఎంతో బావుంటుంది). ఈ వ్యవస్థను నిర్మూలించాలంటే పిల్లలకు బోధించే ప్రాథమిక విద్యలో కనీసం మార్పు తేవాలి. కుల, మత, మూఢ విశ్వాసాలను ఆయుధంగా ప్రాథమిక విద్యను తీర్చిదిద్దాలి. బాల కర్మికుడి జీవితానికుపయోగపడే విధంగా వాడి యాసలో, భాషలో తయారుచేసే అవి అతని జీవితాన్నే మార్చేస్తాయని భావించాలంటారు. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం. ఇలా చేయడమంటే ఒకటి నుండి అయిదో తరగతి వరకూ సిలబస్ను మార్చడం కాదు. ఈ వ్యవస్థకు పట్టిన చీడలను వదిలించాలి. ఒక ఊరికి ఎన్నో సేవలనందిస్తున్న వృత్తులను తక్కువ చేసి, తనది కాని సంస్కృతిని బలవంతంగా వాళ్ళపై రుద్దటానికి ప్రయత్నం చేయకుండా, అందరి బాధల్ని, కష్ట సుఖాల్ని, స్రమను, వాళ్ళ పరిసరాల గురించి పిల్లలకర్థమయ్యే భాషలో చెప్తే బాలలు కార్మికులుగా మారరేమో. ఇక నిరక్షరాస్యతకు కారణాలెన్నో. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కొన్ని వృత్తులు ఎలా చేయాలో పుస్తక రూపంలో లేకపోవడమే. వాటిని మౌఖికంగా నేర్చుకుని చేస్తున్నారు. చదువుకున్న వారు చేసిన పరిశోధన తక్కువే కావటంతో చదివి తెలుసుకునే వీలు లేక వారి నైపుణ్యాన్ని పెంచుకోలేకపోతున్నారంటూ, వృత్తులపై పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేసినపుడు కొంత నిరక్షరాస్యతను తొందరగా తగ్గించవచ్చనుట నిస్సందేహం.

అసలు బాల కార్మికులెలా ఏర్పడతారు? సాధారణంగా వీరు రెండు రకాలు. పల్లెల నుంది వచ్చిన వారు, పట్టణాల్లో వుండేవారు. కొంతమంది ఇంట్లో ఏదో నచ్చక బయటకు వచ్చేస్తారు. అలాంటివcరే బాల కార్మికులుగా తయారవుతారు. అపుడు వారిని పలు రకాల వ్యాపారాలు చేసే వాళ్ళు ఉపయోగించుకుంటారు. వారి శ్రమను దోపిడీ చేసేస్తారు. ముందుగా బాలలు ఈ దోపిడీ వ్యవస్థకు గురి కాకుండా చూడాలి. ఇలాంటి వారిని ఆదరించి తమదైన రీతిలో సహాయం అందించాలి. దీనికి కార్మిక సంఘాల సహాయం తీసుకున్నా మంచిదే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మైనారిటీ తీరని ఆడపిల్లలు సినిమాలు చూసి, ఏవేవో ఊహించుకుని నగరాలకు వెళ్ళిపోతారు. కానీ, సినిమా పరిస్థితి వేరు, బయటి పరిస్థితి వేరన్న సంగతి గ్రహించలేక పోతున్నారు. ఆ తర్వాత వళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఇలాంటి వారిని ఆదుకోడానికి స్వచ్ఛంధ సంస్థలు ధైర్యంగా ముందుకు రావాలి. ఒక పని చేయాలంటే ఒక మనిషి కన్నా, కొంత మంది వ్యక్తులు ఒక శక్తిగా ఏర్పడితేనే కదా ఏదైనా సులభంగా, విజయవంతంగా జరిగేది.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేటపుడు సామజిక, ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలి. మహిళలు ఈ సమాజంలో ఏ స్థానంలో చూపబడుతున్నారు.? ఏ రకమైనా సంస్కృతి, సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు? పట్టణ, నగర మహిళలు ఒకడుగు ముందేసి ఎలా ఉన్నారు? అన్న విషయల్ని గ్రామాల్లో ఉండేవారికి తెలిసేలా శిక్షణ ఇప్పించాలి. బాల్య వివాహాలు ఆపి, బాలికా చదువుకు శ్రీకారం చుట్టాలి. ఇక వికలాంగ పిల్లలకు చేయుాతనందించాలి, వారు ఎంత శ్రద్దతో, కొత్త ఆశలతో ముందుకు వస్తారు, కాని కొత్త వాతావరణంలో ఉండలేక వెళ్ళిపోతారు, అలాంటివారికి ప్రత్యేకంగా శ్రద్ధగా చూడాలి. 'బాల కార్మిక సమస్య' అనగానే చాలా మంది ఇది లేబర్ డిపార్ట్మెంట్కు చెందిందని అనుకుంటారు. కానీ ఇది సమాజ సమస్యే కానీ ఒక 'శాఖ' సమస్య కానే కాదు.

ఇలా కొంతమంది ఉంటే, అసలు తల్లెవరో, తండ్రెవరో తెలియని ఎంతో మంది కనీసం బాల కార్మికుల చిట్టాలో కూడా లేక రోడ్ల మీద, ఫుట్ పాత్ల మీద జీవిస్తున్నారు, మరి వీరి పరిస్థితేమిటి? నిజంగా ఇది దారుణం. ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లల చదువును ప్రభుత్వం చూస్తుంది. ఆరు సంవత్సారల తరువాత వాళ్ళు బడికి వెళ్ళకపోతే బాల కార్మికులని అంటారు. మరి అంతకు ముందే ఈ దేశంలో ఎంతోమంది తమ జీవితాలను మార్చేసుకుంటున్నారు. మున్సిపాల్టి దృష్టిలో పశువులకు, కుక్కలకు లెక్కలుంటాయి, కానీ ఇలాంటి పిల్లలకు లెక్కలు లేవు. కుక్క కరిస్తే మనిషికి హాని కలుగుతుందని వాటిపై నిఘా వేస్తారు, మరి ఇల్లంటి పిల్లలు చదవకపోతే, చైతన్యవంతులు కాకపోతే సమాజంలో ఎన్ని రకాల నేరాలకు కారణభూతులవుతారో చెప్పలేం, ఆలోచించలేం. వీరందిరినీ ప్రభుత్వమే ఒక దారికి తేవాలి. అందరికీ చదువు సాధ్యం కావాలంటే వీధుల్లో అనాధ చిట్టి చేతులు కనపడకూడదు.

ఇక్కడ ముఖ్యమైనది దూసుకొస్తున్న ప్రపంచీకరణ. దీని ఫలితం పేదరికంలో మగ్గుతున్న పిల్లలపై తీవ్రమైన విష ప్రభావాన్ని చూపించనున్నాయి. ఒకసారి బడికి వచ్చిన పిల్లవాడు మళ్ళీ వీధిలో పడకుండా చూసుకోవాలి. కంపెనీలన్నీ ఎక్కడపడితే అక్కడ విస్తరిస్తున్నాయి. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. కార్మికుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల మగవాళ్ళు, ఆడవాళ్ళూ, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయడంతో పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతారు. అంతేకాక ఆ పిల్లలు కూడా పని చేయాల్సిన పరిస్థితి. పాఠశాలల్లో డ్రాపవుట్ల సంఖ్య పెరిగిపోతుంది. ఇతర దేశాలు మన దగ్గరకు వస్తున్నాయంటే ఆ సంస్కృతి ప్రభావాలన్నీ ఈ పిల్లలపైనా పడతాయి. కనుక, వీళ్ళు మళ్ళీ స్వతంత్ర జీవనాన్ని ఏదోలా ఊహించుకుని వీధి పిల్లలవుతారు. కనుక, ప్రపంచీకరణపైనా దృష్టి పెట్టమంటున్నారు. వారిని భాద్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలంటే అంత సులభమేమీ కాదు. దీనిని ఒక యజ్ఞంలా చేయాలి. విద్యార్థులు సైతం దీనిని ప్రోత్సహించాలి. ఒక సోషల్ కమిట్మెంట్ను తీసుకురావాలని, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, ఏ ఏ దేశాల్లో ఎవరెలా కృషి చేశారో అధ్యయనం చేసి చక్కగా ఆ వివరాలన్నీ మనకందించారు.

పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య నేర్పాలని, అక్షరాస్యతే విద్య కాదు, 'విద్య అంటే పిల్లల్లోని శారిరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు సంపూర్ణంగా అభివృద్ధి చెందా'లన్న గాంధీజి మాటలు అనుసరణీయమంటూ అకాడ గాంధీజీ ఆ రోజుల్లో చేతిపని అన్నా, ఈ రోజుల్లో అది వేరే రూపంలో ఉన్న వేరే పనైనా కావచ్చు. ఏదైనా ప్రాథమిక విద్యకు నిధుల కొరత లేదని బడ్జెట్లో తేలింది కాబట్టి కొత్త కోర్సులు ప్రవేశపెట్టవచ్చు. తరువాత విద్యలో అసమానతలు తొలగించాలి. విద్యావకాశాలు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం చూడాలి. ఇంటి భాషలోనే పాఠాలు చెప్పమంటున్నారు. పర భాషలో చదవడం వల్ల విద్యార్థుల్లో అవగాహన, ఆలోచన, అభివ్యక్తి అన్న మూడు అంశాల్లో దేన్నీ పెంపొందించలేని స్థితిలోకి వెళ్ళిపోవటానికి కారణం పరభాషలో బోధన చేయడమని గుర్తించమంటూ, వారికి తమదైన భాషలోనే పాఠాల్ని బోధిస్తే, మూడు పూటల తిండికి ఢోకాలేని రీతిలో వాళ్ళు నైపుణ్యాన్ని చదువు ద్వారా సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యర్థి ఎంత మేలైన విద్యను చదువుకొస్తున్నాడో మాత్రమే గ్లోబల్ ప్రపంచానికి అవసరం కనుక దిన్ని అన్ని చోట్లా ఏర్పాటు చేసేలా చూడాలి. మనపైకి దూసుకొచ్చే పరిణామాల్ని మనమేం చేయలేం. ఆ పరిణామాల్నుంచే అడుగులు వేస్తూ మనం మరో కొత్త ప్రపంచాన్ని ఎట్లా నెలకొల్పుకోగలుగుతామన్నదే చూడాలి. తెలిసిన దాని నుంచి తెలియని దని వద్దకు (నోన్ టు అన్నోన్) అన్నది చదువు విషయంలో ప్రాథమిక సూత్రం. అయితే ఇది ఉల్లంఘన జరుగుతుంది. రాడియో గురించి తెలియని వాడికి కంప్యూటర్ గురించి చెప్తే ఎలా అర్థమవుతుంది?అని ప్రశ్నిస్తూ, వాడికి తెలిసిన విషయాలను ఇంకా అందంగా, కొత్తగా బోధిస్తూ, ఆ పై కొత్త వాటిని గురించి చెప్తే, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వారు ప్రతిభలో ఏ మాత్రం తీసిపోరంటూ, దీనికి పరిష్కారం పాలకుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉందని చుక్కా రామయ్యగారు వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలను పోలుస్తూ, ఉదాహరణలతో చెప్పారు.

ఇక సార్వత్రిక విద్యను పెంపొందించాలని, వర్సిటీల్లో సఖ్యత రావాలని, వాటికి నిధులు రావాలని, వర్సిటీల్లో ఉండే సంక్షోభాలు పోవాలని, ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్న ఐఐటి లు ఇప్పుడెందుకు చిన్న చూపుకు గురవుతున్నాయి, ప్రభుత్వ విధానాల్లో లోపాలే కార్పొరేట్ విద్యా రంగానికి పునాదులని, ఇంజనీరింగ్ విద్యలో ఉన్న లోపాలు, మొదలైన అంశాలను రామయ్య గారు చక్కగా వివరించారు. అయితే ఇవన్నీ మనందరికీ తెలిసినవే. కానీ, ఎందుకో దేనిలోనూ అభివృద్ధి కనిపించడంలేదు. ఎక్కడ, ఎవరిలో లోపముందో అంతు చిక్కని ప్రశ్న. గొప్ప గొప్ప నేతలు పుట్టింది విద్యాలయాల నుంచే కదా. సమాజ పరివర్తనకు మార్గ నిర్దేశం చేసేది విద్యాలయమే. విద్యా రంగంలో ఏ మార్పు రావాలన్నా అందులో కీలక పాత్ర ఉపాధ్యాయులదే అన్నది అందరికీ విధితమే. కనుక, ఉపాధ్యాయ విద్యలో ఇంకా పరిణామాత్మక, గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడితే శ్రేయస్కరంగా ఉంటుందంటున్నారు.

తరువాత చేయాల్సింది కులాల అడ్డు గోడల్ని కూల్చేయాలి. అప్పుడే సమాజం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రీ ప్రైమరి విద్య అందరికీ అందినపుడే అంతరాలు పోతాయి. కనుక, టీచర్ ప్రతీ పిల్లవాడి స్థాయికి దిగి, వాడితో ఉంటూ, వారి అవసరాలకు, వారి భాషలోనే పాఠాలను బోధిస్తే పిల్లలందరూ మేలైన విద్యను అందుకుని, సమాజంలో ఉన్నతులుగా తయారవుతారని, దీని కోసం అందరం కృషి చేయాలి, ముఖ్యంగా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని రామయ్య గారు ఈ పుస్తకంలో వివరించారు.

అయితే, ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అందరం ఈ విషయాలన్నిటినీ ఆలోచిస్తున్నాం. కాకపోతే ఏమీ చేయలేక పోతున్నాం. ఈ పుస్తకంలో రమయ్య గారి కోపం, తపన, ఆవేదనల్ని మనం చూడొచ్చు. ఆయన చేసిన సూచనలు, మనమూ అనుకుంటూ ఉంటాం, కాకపోతే వాటిని అమలు జరపడం కోసం ముందుకు రావాలి. ప్రపంచీకరణలో వస్తున్న మార్పులకు ధీటుగా నిలబడి, ప్రాథమిక విద్యను బోధిస్తూ, తన బడి ఇల్లు అనుకునే పరిస్థితిని నెలకొల్పినపుడే, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించగలం., పనులు చేస్తున్న చిన్నారి చిట్టి చేతులకు సహాయాన్నందిస్తూ, రామాయా గారి ఆశ నిజం కావాలని, వీధి పిల్లలు, బాల కార్మికులు లేని సమాజం త్వరలోనే రావాలని ఆశిద్దాం.






No comments: